![]() |
![]() |
.webp)
చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ జోష్ ని పంచింది. ఇందులో మైసూర్ బొండాలు, చట్నీలు తయారు చేసే టాస్క్ ఇచ్చారు. అలాగే టేస్టో మేటర్ లో సమీరా భరద్వాజ్ - దీపికా జోడి విన్నింగ్ జోడిగా నిలబడ్డారు. ఇక ఈ ఎపిసోడ్ లో పృద్వి శెట్టి- విష్ణు ప్రియా జోడి కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. పృద్వి మైసూర్ బొండాలు వేస్తూ ఉన్నాడు. అలాగే విష్ణు కోసం పాటలు పాడుతూ ఉన్నాడు. ఇక జడ్జ్ మాస్టర్ షెఫ్ జీవన్ యాంకర్ సుమా అందరి దగ్గరకు వచ్చి బోండాలను టేస్ట్ చేసాక పృద్వి వాళ్ళ దగ్గరకు వచ్చారు.
ఇక అక్కడ విష్ణుప్రియ సెపరేట్ గా ఒక అట్ట తీసి ఏదో రాసుకుంటూ కనిపించింది. సుమ అది చూసి ఏంటి రాస్తున్నావ్ అని అడిగేసరికి రెసిపీ రాసుకుంటున్నా.. ఇంటికి వెళ్లి ఇలాగే మైసూర్ బొండాలు వేయాలని అని చెప్పింది. సరే సుమ ఆ ప్యాడ్ తీసుకుని అందులో రాసిందేమిటా అని చదివింది. "పొయ్యి మీద పెట్టొచ్చా పెనం...ఎప్పుడు ఒకటవుదాం మనం...నిన్ను చూస్తే చాలు నూనెలో పడ్డ పూరీలా నా మనసు పొంగిపోతోంది...నువ్వు గుర్తొస్తే చాలు నా గుండె గుత్తి వంకాయలా ఉడికిపోతుంది... మాసాలకు కావాలి లవంగాలు...మన పెళ్లి కోసం కొన్నా ఎన్నో లెహంగాలు...పిడత కింద పప్పు...నన్ను వదులుకుంటే నీ తప్పు..ఇంతకంటే చదివితే నాకు పెద్ద ముప్పు" అంటూ విష్ణు రాసిన రెసిపీ లవ్ లెటర్ చదివేసరికి అందరూ నవ్వేశారు. ఇది లవర్ లెటరొ, కవిత్వమో, రెసిపీనో, పైత్యమో అర్ధం కావట్లేదు అంటూ సుమా దణ్ణం పెట్టేసింది.
![]() |
![]() |